PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టుల సేవలు గుర్తించండి..

1 min read
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీజేఎఫ్​ నాయకులు

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీజేఎఫ్​ నాయకులు

– ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ప్రకటించండి
– ఆర్థిక మంత్రికి వినతిపత్రం అందజేసిన ఏపీజేఎఫ్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : రాష్ట్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి.. వెంటనే ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్​) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. సోమవారం కర్నూలు స్టేట్​ గెస్ట్​హౌస్​లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, నగర మేయర్​ బీవై రామయ్య, జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాంసుందర్​ రెడ్డిని ఏపీజేఎఫ్​ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, సాయి కుమార్​ నాయుడు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా తో అసువులు బాసిన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. 2021 సంవత్సరం మీడియా అక్రిడేషన్ కార్డ్స్ తక్షణమే మంజూరు చేయాలని, కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులకు మరియు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి లక్ష రూపాయలు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కోటా కింద కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ వెంటనే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం నాయకులు మల్లికార్జున్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author