NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐఈఆర్టి ఉపాధ్యాయుడు మృతి

1 min read

నివాళులు అర్పించిన తోటి ఉద్యోగులు..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పాత బస్టాండ్ సంత గేట్ ఎంపీపీ పాఠశాల ఆవరణంలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల భవిత కేంద్రంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవిబాబు మృతి చెందారు.గత 15 సంవత్సరాలుగా దివ్యాంగ చిన్నారులకు విద్యాబుద్ధులు మరియు వారికి శిక్షణ ఇవ్వడంలో చిన్నారులను ముందుకు నడిపించారు. తోటి ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు శనివారం రోజున నందికొట్కూరులో దివ్యాంగ చిన్నారుల ఇండ్లకు వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ శిక్షణ ఇచ్చారు.ఎండలు విపరీతంగా ఉన్నందున వడదెబ్బ రావడంతో ఆరోగ్యం సరిగా నిలందన కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండగా కోలుకోలేక సోమవారం ఉదయం మరణించినట్లు వారు తెలిపారు.సమగ్ర శిక్ష తోటి ఉద్యోగులు రవిబాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

About Author