మదరసాల ముసుగులో వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తే.. !
1 min read
పల్లెవెలుగువెబ్ : మదరసాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. మదరసాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. జీహాదీ శక్తులు వాటిని ఉపయోగించుకోకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. మదరసా ముసుగులో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు నిర్దిష్టంగా వెల్లడైతే ఆ భవనాన్ని కూల్చేస్తామన్నారు.