PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ సీఎం కాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటాం !

1 min read

పల్లెవెలుగువెబ్ : జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే తమ కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాలు గెలుస్తుందని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, ఈలోపు తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా ? అని కామెంట్ చేశారు. అచ్చెన్నాయుడు మాటలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో ఆంద్రా షిప్ మార్ట్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

          

About Author