సరిగా నిద్రపోకపోతే వచ్చే సమస్యలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : రోజులో ఐదు గంటలు, అంతకంటే తక్కువ నిద్రించే వారికి తీవ్రమైన వ్యాధుల (దీర్ఘకాలిక వ్యాధులు) ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్టు యూసీఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ హెల్త్ రీసెర్చర్స్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మధ్య వయసు నుంచి వృద్ధాప్య వయసులోని వారికి ఈ రిస్క్ అధికంగా ఉంటున్నట్టు పరిశోధకులు గమనించారు. ఈ ఫలితాలను పీఎల్ వోఎస్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు. 50 ఏళ్ల వయసులో రోజులో ఐదు గంటలు, అంతకంటే తక్కువ నిద్రపోయే వారు కనీసం ఒక్క తీవ్ర వ్యాధి బారిన పడుతున్నట్టు తెలిసింది. ఇలా 25 ఏళ్ల కాలంలో కనీసం రెండు అంతకుమించి తీవ్ర వ్యాధుల బారిన పడే రిస్క్ 40 శాతం ఉంటోందని తెలిసింది. ఏడు గంటల పాటు నిద్రించే వారితో పోల్చినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. 50 ఏళ్లు, 60 ఏళ్లు, 70 ఏళ్ల వయసులో రోజులో 5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రించే వారు.. ఏడు గంటల పాటు నిద్రించే వారితో పోలిస్తే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం 30-40 శాతం ఎక్కువగా ఉంటోంది. 50 ఏళ్ల వయసులో రోజుకు 5 గంటలే నిద్రించే వారు తదుపరి 25 ఏళ్లలో మరణించే రిస్క్, ఏడు గంటల వారితో పోలిస్తే 25 శాతం ఎక్కువగా ఉంటోంది.