ఈ కేవైసీ చేసుకుంటేనే.. లేదంటే రేషన్ రాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రేషన్ పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఈకేవైసీని తప్పనిసరి చేసింది. సెప్టెంబరు నుంచి ఈకేవైసీ చేసుకున్నవారికే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీ చేసుకోని వారికి ఆపేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మందికి రేషన్ ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. చేసుకోనివారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకున్నా.. ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెలలో చేయించుకోని పక్షంలో ఆ పేర్లను బోగస్‌గా పరిగణిస్తారు. అనంతరం వాటిని తొలగిస్తారు. దీనికోసం ఈనెల 17 వరకు గడువు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 1,48,56,590 రేషన్ కార్డులున్నాయి. వాటి ద్వారా 4,31,84,543 మంది లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్డులోని సభ్యులందరికీ ఈకేవైసీ చేయించాలని చాలాకాలంగా రాష్ట్రాలకు సూచిస్తోంది. రాష్ట్రం ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఈకేవైసీ చేయిస్తోంది. అయినప్పటికీ ఇంకా ఈకేవైసీ చేసుకోని వారి సంఖ్య భారీగానే ఉంది.