గవర్నర్ కు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జీ అయ్యారు. అప్పట్లో కరోనా రిపోర్టు నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయి విజయవాడకు చేరుకున్నారు. కానీ, ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా, అదనపు చికిత్స అవసరమని వారు సూచించినట్లు తెలిసింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.