విక్రయానికి ముందే .. ఐఎంఈఐ నెంబర్ రిజిస్టర్ చేయాలి !
1 min readపల్లెవెలుగువెబ్: భారత్‌లో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్స్ ఐఎంఈఐ నంబర్‌ని ముందుగానే యాంటీ కౌంటర్‌ఫీట్ అండ్ లాస్ట్ హ్యాండ్‌సెట్ బ్లాకింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ప్రతి మొబైల్ 15 అంకెల వినూత్న ఐఎంఈఐ నంబరును కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పోగొట్టుకున్న ఫోన్లను ఈ నంబరు ఆధారంగా వెతకడం కొన్నిసార్లు సాధ్యపడటం లేదు. ఎందుకంటే, అదే ఐఎంఈఐ నంబరుతో టెలికాం నెట్‌వర్క్‌లో మరో (నకిలీ) ఫోన్ వినియోగంలో ఉండటం ఇందుకు కారణమవుతోంది.