ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తక్షణమే తొలగించండి
1 min read
విద్యుత్ శాఖ నిర్లక్యం వల్ల ఎక్కడ ఎవరికి హాని కలిగిన ఉపేక్షించేది లేదు
విద్యుత్ శాఖ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆదేశాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాల గ్రామంలోని పలు కాలనీల్లో ప్రమాదకర రీతిలో వేలాడుతున్న హై టెన్షన్ విద్యుత్ వైర్లను గుర్తించి సత్వరమే వాటిని తొలగించి ప్రజలకు ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఎప్పటికప్పుడు ట్రీ కటింగ్ నిర్వహించాలని, పొలాల వద్ద, తోటల వద్ద ప్రమాధకరంగా వేలాడే ఉండే విద్యుత్ వైర్లను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని సరి చేయాలని, రైతులకు, గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపాలని సూచించారు.ఈ సందర్భంగా తక్షణమే విద్యుత్ వైర్లను సరి చేసే ప్రక్రియ చేపడతామని ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు చేపడతామని విద్యుత్ శాఖ అధికారులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి,మధు బాబు, ఉప సర్పంచ్ చింతమనేని గోపి సహా పలువురు కూటమి నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.