9 భాషలలో.. ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను వినియోగదారులకి అనువుగా తొమ్మిది బాషలలో బుధవారం ప్రారంభించారు. యూసర్ ఇంటర్ఫేస్ తో గూగుల్ ప్లే స్టోర్లో లాంచ్ చేశారు. ఈ కొత్త యాప్ లో వినియోగదారులకు యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ , IMPS రోజు వారి ట్రాన్సాక్షన్ పరిమితిని రెండు లక్షలకి పెంచారు. అంతే కాకుండా వినియోగదారులకి అనువుగా ఉండడడం కోసం తెలుగు తో పాటు మరో 8 బాషలలో కూడా ఈ యాప్ ని వినియోగించుకునే సదుపాయం కల్పించారు. వినియోగదారులందరిని కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ ప్రాంతీయ కార్యాలయం లో మొబైల్ బ్యాంకింగ్ యాప్ లాంచ్ కార్యక్రమాన్ని రీజినల్ ఆఫీస్ లోని సిబ్బంది అందరు జరుపుకున్నారు.