కలమందల పాడు’లో..సుపరిపాలనలో తొలి అడుగు
1 min read
పథకాలపై ప్రజలకు వివరించిన కమతం రాజశేఖర్ రెడ్డి..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఒక్క హామీనీ తెలుగుదేశం పార్టీ నెరవేర్చుతుందని ఉప్పలదడియ టీడీపీ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమంద ల పాడు గ్రామంలో ‘సుపరి పాలనలో తొలి అడుగు’అనే కార్యక్రమం నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కమతం బ్రదర్స్ రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.ఇంకా నాలుగు ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను మీ వద్దకు చేర్చడం జరుగుతుందని ప్రజలతో అన్నారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని అంతేకాకుండా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అన్ని రకాల పింఛన్లను పెంచడం జరిగిందని వారు ప్రజలతో అన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ చిన్న దర్గయ్య,బూత్ కో కన్వీనర్ బాగ్దాద్,బూత్ సోషల్ మీడియా కన్వీనర్ సైసావలి, మరియు బూతు ప్రధాన కార్యదర్శి పక్కిరయ్య మరియు టైలర్ బాబు,ఖాజా మియ్య,అహ్మద్ భాష,వడ్డే శ్రీను,మౌలాలి,రహీం భాష తదితరులు పాల్గొన్నారు.