NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెరుకుచెర్ల’లో ఘనంగా ఎమ్మార్పీఎస్ దినోత్సవం..

1 min read

జెండాను ఆవిష్కరించిన సీనియర్ నాయకులు మాణిక్ రాజ్..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గద్దల మాణిక్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా ఇన్చార్జి డాక్టర్ మున్నంగి నాగరాజు ఆదేశాల మేరకు నందికొట్కూరు ఇన్చార్జి కోట ప్రభాకర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని మాణిక్ రాజ్ అన్నారు.అదే విధంగా పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ  జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కాలనీలో ఎమ్మార్పీఎస్ జెండాను మాణిక్ రాజు ఆవిష్కరించారు.అదే విధంగా గద్దల వెంకటరత్నం,ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి గద్దల ఆనంద్,ఎంఎస్పి సలహాదారుడు గద్దల రాజబాబు,ప్రధాన కార్యదర్శి గద్దల ప్రభాకర్,ఎంఎస్పీ అధ్యక్షులు పానుగంటి నాగభూషణం,ఉపాధ్యక్షులు ఆదామ్,రాజన్న,గద్దల చంటి,ప్రధాన కార్యదర్శి పానుగంటి రాజు,దేవదాసు, నాగన్న,దేవదాసు,సుదర్శనం ఏం రంగస్వామి,పానుగంటి దానమయ్య,కిషోర్ కుమార్, రవి పానుగంటి శీను తదితరులు పాల్గొన్నారు.

About Author