జగన్ ఇలాఖాలో.. బీజేపీలోకి 150 మంది వైకాపా కార్యకర్తలు
1 min readపల్లెవెలుగు వెబ్: పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇంటి నుంచి కదలడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ప్రజలను వైకాపా నేతలు ఇబ్బందిపెడుతున్నారని, బద్వేలులో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. సామన్యులను కూడ వైకాపా నేతలు వదలడంలేదని అన్నారు. బద్వేలు త్యాగరాజ కాలనీలో సోము వీర్రాజు సమక్షంలో 150 మంది వైకాపా కార్యకర్తలు బీజేపీలో చేరారు.
మంత్రి పెద్దిరెడ్డిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు :
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైకాపా నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపాకే ఓటు వేయాలని మంత్రి ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా నేతలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆర్వో, సీఈవోకు వినతిపత్రం అందించారు.