NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పథకాల పేరుతో.. ప్రజలను అవమానిస్తారా..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, కానీ పథకాల పేరుతో ప్రజలను అవమానించడం సబబు కాదని రాయలసీమ మహిళా సంఘం( ఆర్​ఎంఎస్​) జిల్లా కార్యదర్శి తస్లీమ్​ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పథకాల వర్తిస్తాయన్న నమ్మకంతో సచివాలయాల్లోకి వెళ్లిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులను వైసీపీ నాయకులు అవమానించడం సమంజసం కాదన్నారు. నగరంలోని 37వ డివిజన్ వైసీపీ నాయకులు లబ్ధిదారులను చులకనగా చూస్తూ… దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పద్దతి మారకపోతే.. రాయలసీమ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. సమావేశంలో బసిరున్నిసా ఉన్నారు.

About Author