PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయాల్లో .. టీకా..

1 min read

గోనెగండ్ల : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. మండల పరిధిలోని 23 గ్రామ సచివాలయాలలో 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్​ వేస్తున్నారు. శనివారం కరోన నివారణ టీకా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తహశీల్దార్ వేణుగోపాల్ , మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ , మండల వైద్యాధికారి డా..గయాజ్ బేగం లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన టీకాల పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి. సచివాలయంలో మొత్తం 450 మంది కరోన టీకా వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై గ్రామాలలోనూ ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు.

About Author