సర్వీసు రికార్డుల నివేదికలో .. అలసత్వం..!
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది : సర్వీసు అధికారుల నివేదికలో మహానంది మండల అధికారి ఒకరు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ప్రొబేషనరీ పిరియడ్ అనంతరం గ్రామ సెక్రటరీ కార్యాలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా కొనసాగే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేసే అవకాశం ఉంది. కానీ మహానంది మండలం లో ఇటీవల 2 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు పొందిన ఆరవ ట్రేడ్ ఉద్యోగుల పర్మినెంట్ ఉద్యోగులు కొనసాగాలంటే మండల స్థాయి అధికారి సర్వీసు రికార్డుల్లో పలు అంశాలను నమోదు చేయాల్సి ఉంది .కానీ ఇవేమీ పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి . కొందరి పేర్లు మాత్రమే సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయడం.. మరికొంతమంది పెండింగ్ లో ఉంచడం చర్చనీయాంశంగా మారింది. అలాగే సెన్స్ మరియు ఇతర ఆరోపణలున్న వారికి సంబంధించి రికార్డు లో ఉన్నటువంటి మార్కుల్లో నమోదు చేసే అవకాశం ఉంది. .ప్రభుత్వం పంచాయతీ సెక్రెటరీ కార్యాలయాల్లో పని చేసే ఇటీవలే ఉద్యోగం పొందిన ప్రతి ఉద్యోగి రికార్డులను సమర్పించాలని ఆదేశించిన ఇవేమీ పట్టినట్టు స్థానిక అధికారులు వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.