మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా జకియా ఖానమ్
1 min read

పల్లెవెలుగు వెబ్, కడప: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎంపిక పూర్తయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ అన్నారు. జకియా ఖానమ్ స్వస్థలం కడప జిల్లా రాయచోటి. ఆమె భర్త అప్జల్ ఖాన్ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేశారు.

