ఏఐటీయూసీ ఉద్యమ స్ఫూర్తితో.. కార్మిక చట్టాలను కాపాడుకుంటాం..
1 min read
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: ఏఐటీయూసీ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామన్నారు ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి. ఆదివారం ఏఐటీయూసీ 102 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని కైరుప్పలలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఆస్పరిలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునుస్వామి, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, హమాలీ సంఘం అధ్యక్షులు హనుమంతు, చంద్ర , శ్రీనివాసులు, బాబు, రామాంజిని, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య , ఉరుకుందప్ప, ఏఐటీయూసీ నాయకులు సురేష్, సీతా రాముడు తదితరులు పాల్గొన్నారు.