రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి : ఎస్ఐ
1 min read

పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్సై మారుతి శంకర్ సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి శంకర్ మాట్లాడుతూ ప్రశాంత జీవనం అలవర్చుకోవాలని, క్షణికావేశంలో చిన్న చిన్న ఘర్షణలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఒక్కసారి రౌడీషీట్ ఓపెన్ అయితే జీవితకాలం ఉంటుదన్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

