NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన హెల్త్ కేర్ హాస్పిటల్​ ప్రారంభోత్సవం…

1 min read

హొళగుంద న్యూస్ నేడు :  కేంద్రంలో స్థానిక పాత పోలీసు స్టేషన్ వెనుక నూతన హెల్త్ కేర్ హాస్పిటల్ను వైసీపీ మండల కన్వీనర్ షఫియుల్లా ఆదివారం ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ అనుభవం కలిగిన మహిళా వైద్యురాలు డాక్టర్. ఫౌజియ మండలంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. మహిళా డాక్టర్ అందుబాటు లో ఉండడంతో మహిళలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మహిళలు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author