బేడ బుడగ జంగాల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన బేడ బుడగ జంగాల విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, డీఈవో శ్యామల్ పాల్ పాల్గొన్నారు. ఏది సాధించాలన్న అది విద్యార్థి దశతోనే సాధ్యమని, లక్ష్యం పెట్టుకుని ముందు చదువులు ఎన్నుకోవాలని డిఈఓ విద్యార్థులను ఉద్దేశించి సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పుటి మనోహర్ మాట్లాడుతూ.. బుడగ జంగం సర్టిఫికెట్స్ రాలేకపోతున్నాయని నిరాశ చెందకుండా, ఇకనుండి కూడా ఉన్నంత చదువులలో ఇప్పటికన్నా ఎక్కువ మార్కులు సాధిస్తూ ముందుకు సాగాలని, కూటమి ప్రభుత్వం తీర్మానం చేసిన పంపించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి త్వరలో మనకు రిజర్వేషన్ హక్కుల పరంగా న్యాయం జరగబోతుందని, గత వారి యొక్క జీవితాల కన్నా మీ జీవితాలు మెరుగుపడతారని తెలియజేశారు.తాటికొండ నారాయణ జాతీయ అధ్యక్షులు, కొండపల్లి గోకారి, సిరివటి రంగస్వామి, బాదిగ సుంకన్న, పెళ్లూరి కృష్ణవేణిమ్మ, రేవల్లి వరలక్ష్మి, శిరీషాల జమ్మన్న,ఏకనాథం, సిరువాటి గిరిధర్, శ్రీకాంత్, మొదలగు వారు పాల్గొన్నారు.
