పాఠశాలల పునర్వ్యవస్థీకరణలోని అసంగతాలను తొలగించాలి
1 min read
– ఏపీటీఎఫ్ ధర్నా మరియు మెమొరడం సమర్పణ.
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో విద్యా వినాశకర జీవో 117 కు అమెండ్మెంట్స్ గా తీసుకొస్తున్న విధానాలు విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయని వాటిని ఖండిస్తూఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఎమ్మిగనూరు పాత తాలూకా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు అర్బన్ శాఖ అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి నాటూరు రవికుమార్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీనాన్ని నిలిపివేసి పాఠశాలలను పూర్వ స్థితిలో కొనసాగిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఫౌండేషన్ పాఠశాలల పేరుతో కొన్ని పాఠశాలలను 1,2 తరగతులకే పరిమితం చేయడం ద్వారా ప్రాథమిక విద్యను నిర్వీర్యం అవుతున్నదని అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1: 30గా తీసుకోవడం ద్వారా ఉపాధ్యాయులను మిగులుగా చూపనున్నారని, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు పి ఎస్ హెచ్ఎం పోస్టును మంజూరు చేయాల్సిన చోట ఉన్నత పాఠశాలలో మిగులు సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేస్తామనడం, సబ్జెక్ట్ టీచర్లను కేటాయించాల్సిన ప్రాథమికోన్నత పాఠశాలకు మిగులు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను ఇస్తామనడం వంటి అసంబద్ధాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికే జీవో 117 కారణంగా గడచిన విద్యా సంవత్సరం 11 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వలసబాట పట్టారని ఈ అసంబద్ధాలు కూడా అమలు అయితే గనుక ఈ వలసలు మరింత ఎక్కువై ప్రభుత్వ పాఠశాలలు మనగడే ప్రశ్నార్థకమవుతుందని తక్షణమే ఈ విధానాలకు స్వస్తి పలికి ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో కూడిన ప్రాథమిక పాఠశాల వ్యవస్థ అలాగే 6 నుంచి 10వ తరగతి లేదా 12 వ తరగతి తో కూడిన ఉన్నత పాఠశాల విధానాన్నీ పునవ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. జోన్ కన్వీనర్ పాపన్న మాట్లాడుతూ 12వ వేతన సవరణ కమిషన్ ను ఏర్పాటు చేసి 30% ఐ ఆర్ ను ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డి ఏ లను, బకాయి పడ్డ సరెండర్ లీవ్‌లను, పిఆర్సి అరియర్స్ ను చెల్లించాలని కోరారు.జిల్లా ఉపాధ్యక్షులు కాసింజి మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీవో వన్ వన్ సెవెన్ కు వ్యతిరేకంగా నాడు వందరోజుల ఉద్యమం ఏపీటీఎఫ్ చేసినదని నేడు కూడా ఉద్యమ బాట పట్టిన తొట్ట తొలి సంఘం ఏపీటీఎఫ్ అని మా ఈ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో 9వ తేదీన జిల్లా కేంద్రంలోనూ 14వ తేదీన విజయవాడ కేంద్రంలోనూ రాష్ట్రస్థాయి ధర్నాలు చేపడతామని తెలియజేశారు. అనంతరం మండల తాసిల్దార్ శేషఫణి కి మెమోరాండం సమర్పించడం జరిగినది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిలర్ పరశురాం, జిల్లా కార్యదర్శి రంగనాథ్, వీరేష్, జిల్లా ఆడిట్ కన్వీనర్ రాఘవేంద్ర సభ్యులు హేమంత్ కుమార్ ఎమ్మిగనూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి కే శ్రీనివాసులు, హెచ్ఆర్ రాఘవరెడ్డి, మాదిగుండు నాగరాజు, పెద్దకడబూరు మండల ప్రధాన కార్యదర్శి జట్టప్ప, ఆస్పరి అధ్యక్షులు లక్ష్మన్న, సీనియర్లు రామన్న, మునిస్వామి, ప్రతాప్ సిన్హా , ఎంఎన్ మల్లికార్జున, కనికే నాగరాజు, నాగభూషణం, వీర నాగేంద్ర, ఆబిలి వెంకటేష్, ముచ్చిగిరి వీరేశ, రాజశేఖర్, పిబి నారాయణ, వీర శేఖర్, బియన్ ప్రవీణ్, ఎం ప్రవీణ్, కామర్తి శ్రీనివాసులు, బుట్టా శ్రీనివాసులు, బసవరాజు, లతీఫ్, చాంద్ భాషా, సీజీ ఈరన్న, చిలకలదోన ఈరన్న, శివ, నిఖిల్, గోవిందు, కె ఆర్ వెంకటేశ్వర్లు, నారాయణపురం శ్రీనివాసులు, మేటి నరసప్ప, మధు గోపీనాథ్, కిరణ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.