NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తొలి రోజు ముగిసిన ఆట: ఇండియా 258/4

1 min read


పల్లెవెలుగు వెబ్: కాన్పూర్ వేదికగా ప్రారంభమైన మొదటి టెస్ట్ లో టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. టెస్ట్‌‌ కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ (75), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (50) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. ఓపెనర్ శుభమన్ గిల్, యాయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడారు. 21 పరుగుల వద్ద ఇండియా మయాంక్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్ కైలీ జైమీసన్ బౌలింగ్ లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (52) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం వచ్చిన పుజారా (26), రహనే (35) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్, జడేజా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ కైలీ జైమీసన్ కీలకమైన టాప్ ఆర్డర్ 3 వికెట్లు తీశాడు.

About Author