ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలు ఖండించిన ఇండియా
1 min readపల్లెవెలుగువెబ్ : హిజాబ్ వివాదం పై ఇస్లామిక్ దేశాలు చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ప్రేరేపితమని, తప్పుదోవపట్టించేవని తెలిపింది. భారత దేశ వ్యతిరేక ఎజెండాతో ఓఐసీని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తున్నారని మండిపడింది. భారత దేశంలో ముస్లింలపై దాడులు నిరంతరం జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవాలని ఓఐసీ పిలుపునిచ్చింది. జెడ్డాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం విడుదలైన ఓ ప్రకటనలో, భారత దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ తీవ్ర ఆందోళన చెందుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశానికి సంబంధించిన అంశాలపై ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ నుంచి ప్రేరేపిత, తప్పుదోవపట్టించే మరొక ప్రకటనను గమనించామని తెలిపారు.