రోడ్డు సేఫ్టీ హోంగార్డు చొరవతో గాయపడిన మహిళకు వేగవంతంగా చికిత్స
1 min read
ప్రాణాపాయంనుంచి బయటపడిన బాధితురాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏలూరు మండలం సోమవరపాడు బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది.సోమవరపాడు గ్రామానికి చెందిన ఎం.గీత తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో తడిసిన రోడ్డుపై వాహనం స్కిడ్ కావడంతో స్కూటీ అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదాన్ని అక్కడే రోడ్ సేఫ్టీ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ హోంగార్డు నాగరాజు గమనించి వెంటనే స్పందించారు.గాయపడిన మహిళను సమీపంలోని రోడ్ సేఫ్టీ వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే తరలించడం జరిగింది.బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడమే కాక, ఆమె కుటుంబ సభ్యులకు కూడా వెంటనే సమాచారం అందజేయడం జరిగింది. మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీసు శాఖ రోడ్ సేఫ్టీ హోంగార్డు నాగరాజు ను పలువురు అభినందించారు.