పోలీస్ సిబ్బంది శాఖపరమైన సమస్యలపై ఎస్పీ కార్యాలయంలో సమావేశం
1 min read

వినతులను స్వయంగా స్వీకరించి,సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా
ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమమును పురస్కరించుకొని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించినారు.జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ లు మరియు విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏ.అర్ సిబ్బంది హోమ్ గార్డ్స్ వారి యొక్క సమస్యలు గురించి ఎస్పీకి తెలియ చేసినారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి, వారి యొక్క సమస్యలను సమగ్రంగా అడిగి తెలిసికొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కారించలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

