NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్దేశించిన సమయంలోగా ఇండ్ల గణనను పూర్తిచేయాలి

1 min read

ఇండ్ల గణనను పారదర్శకంగా చేపట్టాలి

ఏలూరు లో ఇంటింటికీ వెళ్లి ఇండ్ల గణనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో జనగణనలో భాగంగా చేపట్టిన ఇండ్లగణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక 39వ డివిజన్ లోని ఏటిగట్టు వద్ద నగరపాలక సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇండ్లగణనను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివరాలు అందిస్తున్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. గణన చేస్తున్న సిబ్బంది వివరాలను అడుగుతున్న తీరు, సిబ్బంది హెచ్ ఎల్ బి యాప్ లో వివరాలను నమోదు చేస్తున్న  తీరుని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇండ్లగణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకు అనుగుణంగా ఇండ్లగణనను వేగవంతం చేయాలన్నారు. గణన సిబ్బందికి రోజూ వారీ నిర్దేశించిన లక్ష్యాల మేర, ఏ రోజు లక్ష్యాన్ని అదేరోజు పూర్తి చేయాలన్నారు.  ఇండ్లగణన చేసే సిబ్బంది ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని,అవసరమైన మేరకే వివరాలను తెలుసుకుని యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,  తహసీల్దార్ గాయత్రి, గణన సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

About Author