NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలన

1 min read

టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

అనాలోచన విధానంతో కేంద్ర నిధులు వృధా 

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు 

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని కనకదిన్నె గ్రామం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. నిర్మాణ పనుల పరిశీలించిన అనంతరం క్రాంతి నాయుడు మాట్లాడుతూ, ఆరు నెలల్లో పూర్తి చేసి పంట సాగు వచ్చే సమయానికి ఉపయోగంలోకి తెస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. నాణ్యత లేని, అనాలోచన విధానంలో ప్రభుత్వ సొమ్ము వృధా చేయవద్దని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా కేంద్రం నుండి నిధులు రప్పించగలిగామని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయ నిధులు  ఇవ్వకుండా వచ్చిన కేంద్ర నిధులను వృధా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ టమోటా జ్యూస్ కి పనికి రాదు అని నాయకులు సైతం హేళన చేస్తే ప్రాసెసింగ్ చేయొచ్చు అని రిపోర్టులు ప్రభుత్వాలకు ఇచ్చి కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించుకున్నాం అని తెలిపారు. అలాంటి పరిశ్రమను కాలువ, వంకల పక్కన నిర్మాణం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. చౌడు భూమిలో నిర్మాణాలు చేస్తే భవనాలు ఎలా పరిశిష్టంగా ఉంటాయని అన్నారు.

About Author