ఏఐటీయూసీ ఉద్యమ స్పూర్తితో .. భవిష్యత్ పోరాటం..
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: ఏఐటీయూసీ 102 ఏళ్ల ఉద్యమ స్ఫూర్తితో కార్మిక చట్టాలు కాపాడుకుంటామన్నారు ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, కామ్రేడ్ రఘురాం మూర్తి. ఏఐటీయూసీ ఆవిర్భవించి 102 ఏళ్ల సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల నాయకుడు ఎం. రమేష్‌బాబు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ రఘురాం మూర్తి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు రఘురాం మూర్తి, రమేష్ బాబు, జగదీష్ బాబు లు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న నేటి వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఆవిర్భవించినదని, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం తోపాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగా 1920 నుండి ఏఐటీయూసీ దేశంలో కార్మికుల పక్షనా పనిచేయడం ప్రారంభించిందని వారు అన్నారు. కార్మికుల హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్ర సాధనలో చారిత్రక పాత్ర నిర్వహించిందని ఏఐటీయూసీ ఈ సంఘానికి దేశంలో గొప్ప ప్రముఖులు జాతీయ కార్యదర్శిలుగా పనిచేశారు.. లాలాలజపతిరాయ్ , చిత్తరంజన్ దాస్ .జవహర్ లాల్ నెహ్రూ .నేతాజీ సుభాష్,చంద్రబోస్ .కేఎల్ మహేంద్ర .పి.వి గిరి .,SA డాంగే.ఇంద్రజిత్ గుప్తా. ఎబి బర్ధన్ .గురుదాస్ గుప్తా .లాంటి ఎందరో మహా నాయకులు ఈ సంఘానికి నాయకత్వం వహించారని, ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పడి కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మిక చట్టాలు హక్కులతో దేశానికి, లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు ఏర్పడ్డాయన్నారు.ఈ నేపథ్యంలో దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్మిక చట్టాలను హక్కులను కలరాస్తున్నాయాన్నారు. ఈ కార్యక్రమం లో AISF రాష్ట్ర సమితి నాయకులు శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు శంకర్ నాయుడు, స్వాములు, సలీమ్ బాషా, రాముడు, ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, శేఖర్, తిరుపతి,మహిళా సమాఖ్య నాయకులు దానమ్మ, మాబి తదితరులు పాల్గొన్నారు.