PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మాంటిస్సోరి’లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవం

1 min read

పల్లెవెలుగు: కర్నూలు నగరంలోని ఏ క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో  9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. నగరంలోని  ఏ క్యాంప్ మాంటిస్వరి పాఠశాల,  9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సురేష్ కాళీ ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఏ క్యాంప్ మాంటెశ్వరి, ఎతిన పాఠశాల సిస్టర్ స్యాన్సులాస్ పాఠశాల సర్వేపల్లి విద్యానికేతన్ రిడ్జు పాఠశాల కెవిఆర్ కళాశాల రిడ్జ్ శ్రీలక్ష్మి పాఠశాల ఎన్ ఆర్ పేట పాఠశాలకు చెందిన 30  మంది బాలికలు, ఏఎన్ఓస్, సిటివోస్  లు, పాల్గొన్నారు. ఈ సందర్భముగా కమాండింగ్ ఆఫీసర్ సురేష్యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనానికి ఒక కళ మరియు శాస్త్రం. యోగా అనేది ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి, ఇది “మనస్సు మరియు శరీరం; ఆలోచన మరియు చర్య; నిగ్రహం మరియు నెరవేర్పు; మనిషి మరియు ప్రకృతి మధ్య సామరస్యం; ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఒక సమగ్ర విధానం.” 1 యోగా అనేది వ్యాయామం గురించి కాదు, మనతో, ప్రపంచంతో సమన్వయ భావాన్ని కనుగొనడం; మన జీవనశైలిని మార్చడం మరియు అవగాహన కల్పించడం ద్వారా ప్రకృతి, పర్యావరణ వైవిధ్యాలను ఎదుర్కోవడంలో మాకు సహాయపడుతుంది.

About Author