భారత్ లో పెట్టుబడులు.. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.12,300 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచబోతోందన్న భయాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు సెగ, ద్రవ్యోల్బణ భయం, కంపెనీల మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించి రీతిలో లేకపోవడమూ ఎఫ్‌పీఐలను నిరాశ పరుస్తోంది. దీంతో భవిష్యత్తులో భారత మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతాయని నిపుణులు భావిస్తున్నారు.