వైభవంగా మద్రసా ఆయెషా సిద్ధిఖా ఇస్లామిక్ స్కూల్ వార్షికోత్సవం”
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో స్థానిక ఈద్గా కాలనీలో నిర్వహిస్తున్నటువంటి మద్రసా ఆయెషా సిద్ధిఖా ఇస్లామిక్ స్కూల్ వార్షికోత్సవం కార్యక్రమంలో వివిధ నగరాల నుండి విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు మరియు వక్తలు పాల్గొని విద్య-సామాజిక బాధ్యతలు తదితర అంశాలపై తమ అమూల్యమైన సందేశాలను అందిస్తూ ప్రసంగించారు.ప్రత్యేక అతిధి ప్రముఖ తెలుగు పండితులు గుంటూరు అబ్దుల్ రహిమాన్ మాట్లాడుతూ కాశ్మిర్ ఉగ్రవాద దాడి యావత్ దేశాన్నే కలిచివేసిందని, ఉగ్రదాడిలో అసువులుబాసిన ప్రతి భారతీయుడు మన తోబుట్టువని అమాయక పర్యాటలను అమానుషంగా చంపిన వారు నరరూప రాక్షసులన్నారు. కాగా వారికి శాంతియుత ఇస్లామ్ ధర్మంతో ఎటువంటి సంబంధం లేదని, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక మనిషిని అకారణంగా చంపితే అది సర్వ మానవాళిని హత్య చేయడంతో సరి సమానమని బోధిస్తుందని అలాంటి ధర్మంలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు, నిజమైన ముస్లిమ్ చీమకైనా హాని తలపెట్టబోడని తెలుపుతూ, ఇలాంటి దేశ విద్రోహ ఉగ్ర దాడులను మనమందరం సమైఖ్యతతో సకల వర్గాలు ఏకమై భారతీయులుగా సరైన రీతిలో సమాధానం చెప్పి తీరాలన్నారు, మరియు నేటి యువత విద్యతో పాటు నైతిక విలువలను సైతం పెంపొందించుకుంటూ చెడు వ్యసనాలు, పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులు మరియు గురువుల గౌరవిస్తూ విద్యా, విజ్ఞానాలలో ముందడుగు వేయాలని స్ఫూర్తిని నింపారు.తదనంతరం ముఖ్య అతిధులు టిడిపి రాష్ట్ర నాయకులు చిన్నహ్యట శేషగిరి మాట్లాడుతూ మారు మూల మండలంలో విద్యా వికాసానికి మద్రాసా అయేషా సిద్ధిఖా సేవలు హర్షించదగ్గవని నిర్వాహకులను అభినందించారు. కాగా నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళుతున్న విశ్వంలో విద్యా ఊపిరి లాంటిదని తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎప్పటికి విద్యను విస్మరించిరాదని వివరిస్తూ, నేటి విద్యార్థులకు స్వతంత్ర్య భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ గారి జీవితమే ఆదర్శప్రాయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి నడయాడాలని పిలుపునిచ్చారు.నేడు దేశ వ్యాప్తంగా కొన్ని విద్వేశ శక్తులు కుల మత ప్రతిపాదికన మనల్ని విడదీస్తూ మన మధ్య వైశామ్యాలను పెంచి, మన విశ్వాసాలనే ముడి సరుకులుగా మార్చుకుని, కుట్రపూరితంగా మనలోని ఐకమత్యాన్ని బలహీనపరుస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని వారు రోజురోజుకు మనల్ని మూఢనమ్మకాలు, పాడుబడిన ఆచారాలతో మరింత అంధకారంలో నెట్టివేసెందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. మతముసుగులో జరుతున్న మారణాహోమాలను కలిసికట్టుగా ప్రతిఘటించడం భారతీయుల ప్రాధమిక బాధ్యత, కావున ఇప్పటికైనా మనమందరం బాధ్యతాయుత భారత పౌరులుగా ఎటువంటి ప్రలోభాలు మరియు ప్రగల్బాలకు లొంగకుండా సంఘటితం మరియు జాగృతం కావాల్సిన అవసరం ఉండన్నారు, దీనికై ప్రతి వర్గం కూడా ప్రత్యేకంగా పాటుపడాలని సెలవిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుండి విచ్చేసిన ప్రముఖ ధార్మిక గురువులు మరియు హొళగుంద ధార్మిక గురువులు మౌలానా హాబిబుల్లా జామయి, హాఫీజ్ షాకీర్, హాఫీజ్ జుబేర్, హాఫీజ్ కఫీల్, హాఫీజ్ అబ్దుల్ సుభాన్, హాఫీజ్ సైఫుల్లా, అన్ని మసీదుల ముతవల్లీలు, గ్రామ పెద్దలు మరియు టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, వైసీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, యం.పి.పి తనయుడు ఈసా, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు మహిళలు గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.