కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించటం అభినందనీయం
1 min read
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంచార్జ్ మంత్రులకు కృతజ్ఞతలు
కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఛైర్మన్,కాపు కార్పొరేషన్ కొత్తపల్లి సుబ్బారాయుడు బుధవారం ఏలూరు జిల్లా పర్యటించటం జరిగినది, ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో కాపు కార్పొరేషన్ ద్వారా అమలు అవుతున్న చంద్రన్న స్వయం ఉపాది ఋణాలు, గ్రూప్ ఎంఎస్ ఎంఇ ఋణాలు మరియు మహిళలకు కాపు కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న కుట్టుమిషన్ ట్రైనింగ్ వంటి పధకాల అమలు గూర్చి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,బీసీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ పుష్పలతతో సమీక్షించారు. జిల్లాలోని మండల మరియు మున్సిపాలిటీ పరిధీ లో జరుగుతున్న వివిద పధకాల అమలు తీరును అడిగి తెలుసుకోవటం జరిగినది, విదేశీ విద్య పధకం అమలు పై కూడా చర్యలు చేపడతామని మరియు త్వరలో కాపు కార్పొరేషన్ ద్వారా మెగా డిఎస్ సి కి కోచింగ్ కు చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కాపు కార్పొరేషన్ మరియు ఇతర కార్పొరేషన్ల ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారన్నరు. అదేవిధంగా కార్పొరేషనులు బలోపేతానికి వాటికి కావలసిన నిధులు వారు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సుబ్బారాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పుష్పలత చైర్మన్ కు శాలువా కప్పి, బొకే అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.