చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత
1 min readప్రముఖ పారిశ్రామికవేత్త మద్దెల శ్రీనివాసరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ ఓవర్సీస్ లెదర్ ఫ్యాక్టరీ అధినేత పాఠశాల పూర్వ విద్యార్థి మద్దెల శ్రీనివాసరెడ్డి (రాణి పేట) అన్నారు .శుక్రవారం నాడు వెలుగోడు పట్టణ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గార్డెన్ లో ఆయన మొక్కలను నాటారు.ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఐదు మొక్కలను అయినా నాటి వాటిని పరిరక్షించినట్టయితే పర్యావరణాన్ని కాపాడిన వారముఅవుతామన్నారు.పచ్చని చెట్లు మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే కాక వర్షాలు కురవడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి, సంఘం కార్యనిర్వాహక సభ్యులు జయరామిరెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్, నసురుల్లా ఖాన్ ,లక్ష్మీనారాయణ , శ్రీనివాసులు, టి మురళి తదితరులు పాల్గొన్నారు.