NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధలకు న్యాయ హక్కులపై అవగాహన కలిపించడం మన బాధ్యత

1 min read

– లీగల్ సర్వీసెస్ యూనిట్ కమిటీ సభ్యులు  లయన్ డాక్టర్  రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు , న్యూస్​ నేడు:  జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి.  లీలా వెంకట శేషాద్రి గ ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పుల్లారెడ్డి కాలేజీ సమీపంలో ఉన్న కంపాషన్ సొసైటీ హోప్ ఆఫ్ హోమ్ ను  తనిఖీ చేశారు .అక్కడి సౌకర్యాలు ,పరిశుభ్రతను పరిశీలించారు .అక్కడ వసతి పొందుతున్న అనాధలను అడిగి  నిర్వాహకులు అందించే భోజన ,వసతి సౌకర్యాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి  కె. డి. జె బాబు, ఆశ్రమ నిర్వాహకులు బ్లెస్సి తదితరులు పాల్గొన్నారు.

About Author