ఎంపీ ఈవో లకు కనీస వేతనం అందేలా చూడాలి
1 min read– ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేత
పల్లెవెలుగు ,వెబ్ గడివేముల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్నావంటి 1611 మంది బహుళ విస్తరణ అధికారులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మినిమము టైమ్ స్కేలు ఇవ్వాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ విషయం పై ముఖ్యమంత్రి గారు సానుకులంగా స్పందించి మినిమం టైమ్ స్కేల్ తప్పకుండా కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు ఎంపీఈవోలు తెలిపారు కాంట్రాక్ట్ పద్ధతి లో డిస్ట్రీక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నుకోబడి గత 8 సం॥రాల నుండి రైతులకు మరియు వ్యవసాయ శాఖకు మధ్య వారధిగా ఉంటు వివిధ పథకాలు రైతులకు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్నటివంటి (రైతూ భరోసా) లకు ఇంఛార్జి లు గా కుడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఎంపీఈవోలు చామంతి ,దస్తగిరమ్మ మని, గ్లోరి, రామకృష్ణ,సూరిబాబు,హనుమ నాయక్, గోపాల్, రాజశేఖర్, మల్లేశ్, నాగరాజు, రామకృష్ణ తదతరులు పాల్గొన్నారు.