పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
1 min read
టిడిపి సిటీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు
విజయవాడ , న్యూస్ నేడు : ఏప్రిల్ 25 విజయవాడ: పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతులైనవారి కుటుంబాలు, గాయపడిన కుటుంబాలు ఎంతో బాధ అనుభవిస్తున్నారని టిడిపి సిటీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తగిన రీతిలో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లో పహల్గావ్ లో ఉగ్రవాదులు దాటిన ఖండిస్తూ టిడిపి సిటీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. నగరంలోని సామరంగం చౌక్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోలంకి రాజు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన ఎవరిని వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ అధ్యక్షులు సురభి బాలు, 47 డివిజన్ అధ్యక్షుడు పొనుగుపాటి చిన్న సుబ్బయ్య, 35వ డివిజన్ అధ్యక్షురాలు నందకుమారి, 39 వ డివిజన్ అధ్యక్షులు కే శివశర్మ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, పశ్చిమ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, లక్కు శాంతి, మీరాబి, అపర్ణ జ్యోతి, దుర్గా మల్లేశ్వరి, కొట్టేటి సరిత, వెన్నాడ ప్రియ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
