జగనన్న గొప్ప ఆలోచనే… జగనన్న ఆరోగ్య సురక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలం దేవనబండ , తుగ్గలి మండలం రాతన , మద్దికేర మండలం ఎం అగ్రహారం గ్రామాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పరిశీలించారు.. ఈ క్యాంపులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని,గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతి ఒక్కరికి ఖరీదైన వైద్యం అందాలని మన ముఖ్యమంత్రి జగనన్న ఆలోచించారని అన్నారు. అందుకే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రతి గ్రామంలో మన ముందుకు తెచ్చారని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి చికిత్స అందించడం దేశంలో ఏ పార్టీ కూడా చేయడానికి ముందుకు రాలేదని అది మన జగనన్న గొప్ప ఆలోచనతోనే ఈరోజు పేదవాడికి ప్రతి ఇంటి వద్దకు వైద్యం అందుతుందని తెలిపారు. గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి ఎమ్మెల్యే కంటిఅద్దాలు అందజేశారు.అనంతరం రాతన గ్రామంలో రభీ సీజన్లో ప్రభుత్వం 40% శాతం సబ్సిడీ పై అందిస్తున్న పప్పు సెనగ విత్తనాలను రైతులకు అందజేశారు.ఎం.అగ్రహారం గ్రామంలో మద్దికెర మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన మండల కన్వీనర్ అగ్రహారం గంపల వెంకటేశ్వర్లును ప్రత్యేకంగా అభినందించారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ మనమందరం కలిసి ముందుకు వెళ్లాలని, 2024ఎన్నికలలో మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. మీ ఆశీస్సులు మీ చల్లని దీవెనలు కావాలని వర్గాలకు తావు లేకుండా, సమిష్టి కృషితో చేయాలని గత ఎన్నికలలో ఎంత మెజార్టీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండలం దేవనబండ గ్రామ నాయకులు,తుగ్గలి మండలం రాతన గ్రామ నాయకులు మరియు మద్దికేర మండల వైస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.