ఎల్లార్తి దర్గాని దర్శించుకున్న జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఎల్లార్తి దర్గా స్వామివారిని నేడు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆలూరు నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో ఎల్లార్తి షేక్షావలి,శాశవలి, మాబు సుభాని దూది పీర స్వామివారులను దర్శించుకున్న జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మరియు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని మండల అధ్యక్షులు గుమ్మల రాజేంద్రలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరం మనసులో ఉన్న బాధను తొలగిపోవడానికి చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి మొక్కలు మొక్కుతున్నందుకు మన కర్నూలు జిల్లా గర్వపడాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు వివక్షత లేకుండా సమాంతరంగా జీవించి రాజ్యాంగబద్ధంగా ముందుకు నడుస్తూ జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం అన్ని విధాలుగా ముందుకు వెళ్లి, ఆర్థిక అసమానతలు తొలగిపోయి ఉన్నత శిఖరాలను అధిగమించాలని మొక్కుకున్నామని మాట్లాడడం జరిగింది . ఈ కార్యక్రమంలో బాలరాజు, మున్నా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలు, ప్రజలు ,ఏపీ,