NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 నేడు ఢిల్లీ జంతర్​ మంతర్​ వద్ద … బ్యాంకర్ల ధర్నా..

1 min read

24,25న దేశ వ్యాప్త సమ్మె

  • యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కర్నూలు జిల్లా కన్వీనర్​ ఈ.నాగరాజు, ఏఐబిఈఏ జనరల్​ సెక్రటరి శివకృష్ణ

కర్నూలు, న్యూస్​నేడు: ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పని భారం పెరిగిందని, దీంతో శారీరకంగా… మానసికంగా ఒత్తిడికి గురవుతూ… ఆత్మహత్య చేసుకుంటున్నారని, వెంటనే బ్యాంకింగ్​ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కర్నూలు జిల్లా కన్వీనర్​ ఈ.నాగరాజు, శి ఏఐబిఈఏ జనరల్​ సెక్రటరి శివకృష్ణ . ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు.  బ్యాంకింగ్​ రంగంలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలని  డిమాండ్​ చేస్తూ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఇందుకు ఢిల్లీ బయలుదేరినట్లు వారు స్పష్టం చేశారు. అక్కడ ధర్నా అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆ శాఖ కార్యదర్శులకు మెమోరాండం ఇస్తామని  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కర్నూలు జిల్లా కన్వీనర్​ ఈ.నాగరాజు, ఏఐబిఈఏ జనరల్​ సెక్రటరి శివకృష్ణ  వెల్లడించారు.

డిమాండ్స్  ఇవి…

1.బ్యాంకుల్లో సరిపడ ఉద్యోగ నియామకాలని అన్నీ క్యాడర్ ల్లో కలిపించాలి

2.తాత్కాలిక ఉద్యగులను రెగ్యులరైజ్ చేయాలి.

3.వారం లో 5 రోజుల పనిదినాలు ఇవ్వాలి (శని, ఆదివారం సెలవు ఇవ్వాలి )

4.కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఉద్యగ వ్యతిరేక ఆదేశాలు రద్దు చేసుకోవాలి.

5.12 వ వేతన ఒప్పంద లో మిగిలిపోయిన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలి.

6.కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ రూ. 25లక్షలు పెంచి ఆదాయ పన్ను తీసేయాలి.

7.IDBI బ్యాంకు ప్రైవేట్ చేయరాదు.

8.బ్యాంకు ల్లో అవుట్ సోర్స్ ఉద్యగాల నియామకాలు వ్యతిరేకిస్తాo.

9.బ్యాంకు ఉద్యోగుల పై జరుగుతున్న దాడులని వ్యతిరేకిస్తాము.

About Author