NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆటో కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.. సిఐటియు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ఆటో కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సిఐటియు ప్యాపిలి మండలం ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి స్వాధిస్తున్నామని తెలిపారు. మరోవైపు లక్షలాది మంది ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యాయం ఉద్యోగ ఉపాధి అవకాశాలు  కల్పించాలని రాష్ట్రంలోని లక్షలాదిమంది ఆటో కార్మికులు ఇంటర్ డిగ్రీ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక తన పైన ఆధారపడిన తల్లిదండ్రులను భార్య పిల్లల్ని పోషించుకోవడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫైనాన్స్ వారి ద్వారా ఆటోలు తెచ్చుకుని రోజు బాడుగలతో కుటుంబాల జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నేడు కూటమి  ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మూలంగా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఫైనాన్స్ కట్ట లేక వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. శ్రమకు తాగిన వేతనాలు ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు.

About Author