NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ.. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న భేటీ జ‌రుగుతోంది. అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు సభ తర్వాత అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. నోవాటెల్ హోటల్లో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి ఆహ్వానించినట్లు తెలిసింది. బీజేపీ వర్గాలు ఇలా చెబుతున్నప్పటికీ ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ పక్షానే ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఎన్టీఆర్ భాగస్వామి కాలేదు. రాజకీయాలకు వీలైనంత దూరం జరిగి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్‌ను కేవలం సినిమాలో బాగా నటించాడని ప్రశంసించేందుకే పిలిచి ఉంటారని భావించలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

                                                   

About Author