NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందువుల మనోభావాలు జోలికొస్తే ఖబడ్దార్

1 min read

ఎమ్మిగనూరులో శివ సర్కిల్ లో  ఉదయం 10గంటలకు ర్యాలీ ప్రారంభం అందరూ పాల్గొనాలి

కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ పిలుపుమేరకు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో జరిగిన సి.ఐ అత్యుత్సాహం, మరియు బల ప్రదర్శన చేయడం తీవ్రమైన తప్పు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సారథ్యంలో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కలిసికట్టుగా నడిపిస్తున్న సుపరిపాలన, ప్రజలకు స్వేచ్ఛ కలిగిస్తూ నమ్మకం తో జీవిస్తున్నారు. కానీ ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వంపై విమర్శలు రాకూడదు ఇలాంటి ఓపిక లేని, అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లపై కాళ్లు బూట్లతో తన్నడం చూస్తుంటే హిందువుల పండుగలు చేసుకోవడం ఈయనకి ఇష్టం లేదా??  లేక ఈయన  సహనం కోల్పోయాడా అసలు సహనం కోల్పోవాల్సి వస్తే  పండగలకు సెలవు పై వెళ్లాలి. అంతేగాని ఇలా మా సోదరులు చేసుకుంటున్నటువంటి వినాయక నిమజ్జనం ఉత్సవంలో తన్నడం చూస్తుంటే ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలో అల్లర్లు  జారకుండా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు అల్లర్లు  జరిగేలా సృష్టిస్తారు అన్న సందేహం వస్తుంది . లా అండ్ ఆర్డర్, ఓపిక సహనం  జిల్లా ఎస్పీ ని చూసి నేర్చుకోవాలి. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో జరిగిన నిమజ్జనం కార్యక్రమాలలో ఎక్కడ అల్లర్లకు తావివ్వకుండా ఎటువంటి చిన్న గొడవలకు కూడా రాకుండా చూసుకొని ,ఆదోని పట్టణం వంటి సమస్యత్మకవంతమైన ప్రాంతాలలో కూడా పూర్వ రూట్ మ్యాప్ ను కొనసాగించి శభాష్ అని ప్రజలలో గౌరవం పొందారు ,నమ్మకం  పెంచుకున్నారు కానీ అలాంటి ఆఫీసర్ కింద పని చేస్తూన్న ఎమ్మిగనూరు సిఐ అలాంటి ఆఫీసర్లకు ,ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఆయన పనితీరుంది  వెంటనే సి. ఐ  ను సస్పెండ్ చేయాలని గౌరవ ఎస్పిని కోరడం జరుగుతుంది. అలాగే నేడు గురువారం ఈ విషయంపై జరుగు ర్యాలీకి ప్రతి ఒక్క హిందూ బంధువులు అలాగే ప్రతి బిజెపి కార్యకర్త  తదితరులు పాల్గొనాలి.

About Author