ఖుష్బూకు కరోన !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ హీరోయిన్ ఖుష్బూకు కరోన సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘ గత రెండు కరోనా వేవ్‌ల నుంచి నేను తప్పించుకున్నాను. అయినప్పటికి ఈ సారి నాకు కరోనా సోకింది. నిన్నటి వరకు నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ముక్కు నుంచి కారడం అధికం కాగానే పరీక్ష చేయించుకున్నాను. అప్పుడే కరోనా అని నాకు తెలిసింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల 5 రోజుల పాటు నన్ను ఎంటర్ టైన్ చేయండి ’ అని ఖుష్భూ ట్వీట్ చేసింది. ఖుష్బూ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు.