NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నత్త నడకన సాగుతున్న కేటి రోడ్డు పనులు- తాతా సుబ్రమణ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్​ విజయవాడ : నగరం లోని పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కేటీ రోడ్డు ను సిమెంట్ రోడ్లు గా ఆధునీకరిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పనులు నత్తనడకగా సాగుతున్నాయని ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం విచారణ వ్యక్తం చేశారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ ప్రాంతం రోడ్డు పనులు ఆలస్యంగా జరగడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా వేలాదిమంది విద్యార్థిని విద్యార్థులు స్థానిక విద్యా సంస్థల్లో చదువుకుంటుంటారని, వారు కళాశాల లకు రావడానికి నిరంతరం తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో చిన్న చిన్న ప్రమాదాలు సైతం నిత్యం జరుగుతూనే ఉన్నాయని తెలియజేశారు. ఇదే విషయాన్ని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని చెప్పారు. అలానే ఈ విషయమై శాసనసభ్యులు మాట్లాడుతూ ఇది సిమెంట్ రోడ్డు ఎన్ని సంవత్సరాలైనా అవుతుంది భరించాలి అంటూ చాలా అవమానకరంగా మాట్లాడారని విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ సిమెంట్ రోడ్డు పనులలో ఆలస్యం జరగటానికి ఇక్కడ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు, డివిజన్ కార్పొరేటర్ల మరియు స్థానిక శాసనసభ్యుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా దర్శనమిస్తుందని దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని తాతా సుబ్రమణ్యం కోరారు. గడపగడపకు కార్యక్రమంలో నాయకులను ప్రజలు నిలువరింప చేస్తున్నారని దీనిని గమనించాలని సూచించారు.

About Author