కర్నూలు.. ఉపాధ్యాయుల ఆందోళన
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలులోని ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి కర్నూలులో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నారు. మోకాళ్లపై కూర్చుని సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా… దాన్ని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుల మీదనే అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు నోటీసులో ఇవ్వడం వల్లనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నాగన్న(52) అనే ఉపాధ్యాయుడు తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.