జనసేన జెండా చూసి భయం పట్టుకుంది !
1 min read

పల్లెవెలుగువెబ్ : వైసీపీ సర్కార్‌లో భయం మొదలైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. విజయవాడ, జగ్గయ్యపేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణను.. వైసీపీ అడ్డుకోవడం వారిలోని ఓటమి భయాన్ని చెబుతోందన్నారు. జనసేన జెండా దిమ్మెను కూల్చినవారిపై కేసులు పెట్టలేదని, ప్రశ్నించినవారిపై మాత్రమే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది ఎంతవరకు న్యాయమే పోలీసులు ఆలోచించాలని హితవుపలికారు. వైసీపీ జెండా దిమ్మెలు, విగ్రహాలకు అనుమతులు ఉన్నాయా? అని పవన్ ప్రశ్నించారు. అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని నిలదీశారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని హెచ్చరించారు.

