వైసీపీ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ ఎన్నిక…
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ఎమ్మిగనూరు మండలం, పరామందొడ్డి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీ నారాయణ యాదవ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా, ఈ నియామకాన్ని అందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక కి, బుట్టా శివనీలకంఠ కి మరియు ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి.ఆర్. బసిరెడ్డి కి గొల్ల లక్ష్మీ నారాయణ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, దివ్యాంగ సోదరుల హక్కుల కోసం అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ శ్రేణుల సహకారంతో కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారికి చేరువ చేయడానికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి, దివ్యాంగుల అభివృద్ధి కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బసిరెడ్డి , అడ్వొకేట్ ఇర్షాద్ , గొల్ల రంగన్న , గొల్ల నాగప్ప , వడ్డే కుమార్ , యాకోబు , వెంకటేష్ , దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.