మూక్ నాయక్ మాస పత్రికను ఆవిష్కరించిన ఏలూరు జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : మూక్ నాయక్ జీవితానికి పరమార్థం ఉండాలంటే ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించాలని, అందుకు విషయం, విలువలతో కూడిన భాషా పరిజ్ఞానం అవసరమని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం మూక్ నాయక్ ( ప్రశ్నించే ప్రజా గొంతుక) సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విశ్లేషణ మాసపత్రిక ప్రత్యేక సంచికను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ భారతీయ విలువలతో కూడిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్నారు. తెలుగు సాహితీరంగం సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విశ్లేషణలతో అను నిత్యం పాఠకులను ఆకట్టుకొనే విధంగా మూక్ నాయక్ మాసపత్రిక అభివృది చెందాలన్నారు. మంచి విత్తనం మాత్రమే సత్ఫలితాలనివ్వగలదని, అందుకు నిదర్శనమే మూక్ నాయక్ అన్నారు. ఈ మాస పత్రిక కూడా ప్రజలకు సమాచారాన్ని పంచే శక్తివంతమైన సాధనంగా ఉండాలని, ప్రజలమధ్య కమ్యూనికేషన్ గా ఉండి వారికి జ్ఞానాన్ని మచి అందించే గొప్ప మాధ్యమంగా ఉపయోగపడాలని, సామాజిక సమస్యలు మరిన్నింటిపై అద్భుతమైన కథనాలను అందించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు, చేరవేయాలని ప్రజల యొక మంచి.చిడుతో విజయం సాధించాలని మూక్ నాయక్ పత్రికా యాజమాన్యానికి,టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చీఫ్ ఎడిటర్ మత్తే బాబి, పిట్టా రాహుల్, శామ్యూల్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.