మే డే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
1 min read
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులైన శ్రీ జి. కబర్థి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ ఈ రోజు అనగా 01-05-2025 న ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ఉత్సవాలను న్యాయ సేవ సదన్ నందు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం NALSA (అసంఘటిత రంగంలో కార్మికులకు న్యాయ సేవలు) పథకం, 2015 మరియు రాజ్యాంగం కల్పించిన చట్టాలను గురించి అవగాహన కల్పించి, వీటివల్ల మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. కార్మిక చట్టాలను గురించి అవగాహన కల్పించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివరావుమాట్లాడుతూ కార్మికులందరూ ఈ-శ్రమ్ కార్డులు పొందవలసిందిగా కోరారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు వివిధ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపజేయడం జరుగుతుందని తెలిపాడురు. ఈ కార్డు పొందిన ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణ/ అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ శ్రీలక్ష్మి, కేశన్న, ప్రసాద్, దుకాణ కార్మికులు, ఆటో, హమాలీ, బిల్డింగ్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.